కాంగ్రెస్​ను దెబ్బకొట్టేందుకే

కాంగ్రెస్​ను దెబ్బకొట్టేందుకే
  • ఇందిరా’ సినిమా బీజేపీపై కోదండరెడ్డి ఫైర్ 

హైదరాబాద్, వెలుగు:  దేశ ప్రజలకు ఇందిరా గాంధీ కుటుంబాన్ని దూరం చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తు న్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్​ను ఎదుర్కోలేని బీజేపీ, ఎంపీ కంగనా రనౌత్​తో ఇందిరా సినిమా తీస్తున్నారని విమర్శించారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ.. మోదీ సర్కార్ ఇందిరకు వ్యతిరేకంగా కుట్ర చేసి దేశంలో రాజకీయం చేయాలని చూస్తున్నాదని ఆరోపించారు. అందుకే కంగనాతో ఇందిరా గాంధీపై సినిమా తీస్తున్నారని, దీన్ని సిక్కులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.