
కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మారిపోయారు. ఎలక్షన్లకు ముందు.. తర్వాత కూడా ఆమె ఎప్పుడూ ఏదో ఓ బర్నింగ్ ఇష్యూతో వార్తల్లోకి వస్తున్నారు. చంఢీగర్ ఎయిర్ పోర్ట్ లో గురువారం ఎంపీ కంగనా రనౌత్ పై CISF మహిళా కానిస్టేబుల్ దాడి చేసిన విషయం తెలిసిందే. వెంటనే మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను పై అధికారులు సస్పెండ్ చేసి, అరెస్ట్ కూడా చేశారు. రైతు సంఘాలు చేస్తున్న నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగనా రనౌత్ ను కొట్టానని, ఆమె రైతు సంఘాల ఉద్యమానికి మద్ధతు ఇస్తున్నా అని కానిస్టేబుల్ కౌర్ చెప్పుకొచ్చారు. అయితే ఆమె సస్పెండ్, అరెస్ట్ కు వ్యతిరేకంగా కిసాన్ యూనియన్లు నిరసన ప్రకటించాయి.
జూన్ 9న మొహాలీలో ఆంధోళన చేపట్టనున్నట్లు రైతు సంఘాలకు పిలుపునిచ్చాయి. ఢిల్లీలో రైతు సంఘాలు నిరసన తెలుపుతుంటే.. కంగనా రనౌత్ వారిని ఉద్దేశించి.. వంద రూపాయల కోసమే రైతులు అక్కడ కూర్చొన్నారని ట్విట్ చేశారు. నిరసన చేస్తున్న వారిలో కౌర్ తల్లి కూడా ఉందట.. ఆ ట్విట్ ఆమెను చాలా బాధ పెట్టిందని తర్వాత కానిస్టేబుల్ కౌర్ వివరించింది. అందుకే కంగనా రనౌంత్ చెంపపై కొట్టానని చెప్పింది.