మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో నేతగా మోదీ నిలిచారు.
మోదీ కేబినెట్‌లో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో మిత్రపక్షాల నుంచి 11 మంది ఉన్నారు. కేబినెట్ లో 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి(బీజేపీ), బండి సంజయ్(బీజేపీ), ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు(టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ), శ్రీనివాస్ వర్మ(బీజేపీ) కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇటీవల జరిగిన లోక్ సభ ఫలితాల్లో 543 సీట్లలో ఎన్డీయే కూటమి 293, ఇండియా కూటమి 232 స్థానాలు, ఇతరులు 18 స్థానాలను గెలుచుకున్నారు.