
ప్రధాని మోదీ హన్మకొండ పర్యటన వేళ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జూన్2 న ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. మోదీ బహిరంగ సభకు హాజరుకానున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లు, జన సమీకరణపై బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్, ముఖ్య నాయకులతో కలిసి చర్చించనున్నారు. కాగా జూన్1న పార్టీ నేతలతో కలిసి అయోధ్యనగర్‌లోని పీవోహెచ్వాగన్మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను కిషన్‌రెడ్డి సందర్శించారు.
వెయ్యి స్తంభాల గుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బీజేపీలో సీనియర్లీడర్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మకాం వేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.