తెలంగాణలో 30 సీట్లు అయినా ఇవ్వాలి : బీజేపీతో జనసేన

తెలంగాణలో 30 సీట్లు అయినా ఇవ్వాలి : బీజేపీతో జనసేన

త్వరలో జరగనున్న  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేనతో  కలిసి పోటీ చేసేందుకు బీజేపీ చర్చలు జరిపింది.   ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ హైదరాబాద్ లోని పవన్  కల్యాణ్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు ఎన్నికల్లో పోటీ చేయడంపై వారు పవన్ కల్యాణ్ తో   సావధానంగా చర్చించారు.  ఈ సారి  తెలంగాణలో 30 స్థానాల్లో   జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ బీజేపీ నేతలకు వివరించారు.   

Also Read : రాహుల్, ప్రియాంక గాంధీ టూర్.. రామప్ప ఆలయాన్ని మోహరించిన భద్రతా బలగాలు

2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం, బీజేపీకి మద్దతు ఇచ్చినట్లుగా పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అంతేకాకుండా  గత GHMC ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా బీజేపీ గెలుపుకు కృషి చేసినట్లుగా వారికి వివరించారు.  అయితే ఈ ఎన్నికల్లో  కనీసం 30 స్థానాల్లో పోటీ చేయకపోతే కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బ తింటుందని ఈ సందర్భంగా  పవన్ వారకి తెలిపారు.  ఉమ్మడిగా పోటీ చేసే విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

మరోవైపు  2023 అక్టోబర్ 20 లేదా 21న బీజేపీ ఫస్ట్ లిస్ట్ జాబితా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  60 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై చర్చించేందుకు  రాష్ట్ర బీజేపీ  ధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.