హైదరాబాద్, వెలుగు: బీజేపీ సోషల్‌మీడియా టీమ్‌పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో బీఆర్ఎస్చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సోషల్‌మీడియా టీమ్‌తో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
జీహెచ్ఎంసీలో పార్టీని బలో పేతం చేయడంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రజాసమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. కాగా, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్‌పై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మైనంపల్లి, తలసానిని తరచూ కలుస్తున్నారన్న దానిపై ఆరా తీసినట్టు సమాచారం.