
రాష్ట్రంలో ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని అన్నారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంగా ఆలోచిస్తుందని.. ప్రశ్నించే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. మంద కృష్ణ మాదిగను హౌస్ అరెస్టు చేయడం కరెక్టు కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత హడావిడి ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం,ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నాయని విమర్శించారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం పునరలోచించాలని అన్నారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎందుకు కూల్చి వేశారో చెప్పాలన్నారు. ప్రశ్నించిన దళిత సంఘాల నోరు నొక్కుతున్నారు తప్ప సమాధానం చెప్పడం లేదని అన్నారు కిషన్ రెడ్డి. జగ్జీవన్ రామ్ , అంబెద్కర్ ల జయంతి లకు కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.దీనిపై కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు కిషన్ రెడ్డి.