యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీని సీఎం మరిచిపోయారని విమర్శించారు. 2లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు.
హైదరాబాద్ ధర్నా చౌక్ లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. సెక్రటేరియట్ పైరవీలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ మాదిరి సీఎం రేవంత్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.