బోగస్ బోనస్ పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బోగస్ బోనస్ పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బోగస్ బోనస్ పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.సీఎం రేవంత్ హైదరాబాద్లో ఇళ్లు కూలుస్తు.. నల్గొండలో రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇళ్లు కుల్చవద్దు అంటే ముఖ్యమంత్రి బుల్డోజర్లతో తొక్కుస్తానంటున్నారని.. పేదల కోసం చావడానికైనా సిద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి సవాల్ ను స్వీకరిస్తూ.. రేపు పేదల ఇళ్లల్లో మూసీ పక్కనే నిద్రిస్తామని అన్నారు.

పేదల ఇళ్ల కూల్చకుండా ప్రక్షాళన చేస్తే.. మొదటి పార, తట్ట బిజేపి ఎత్తుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు సిద్దంగా ఉంటే ముడు నెలలు మూసీ పక్కన జీవించేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Also Read : పండిన ప్రతి గింజను కొంటాం.. సన్న వడ్లకు బోనస్​ఇస్తాం..

తెలంగాణ సస్యశ్యామలమైందని మహారాష్ట్రలో ప్రకటనలు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రజలకు ఏమి ఒరిగిందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.రాహుల్ గాందీ పోగడుతుంటే..  రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ, అబద్ధాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

అశోక్ నగర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని.. నిరుద్యోగుల ఆవేదనలో మార్పు లేదని అన్నారు. ప్రతి పైసా కేంద్రం భరిస్తున్నా.. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, రైతు భరోసా 15 వేలు కాదు కదా..  15పైసలు ఇవ్వలేదని అన్నారు కిషన్ రెడ్డి.