మోదీ నాయకత్వంలో దేశం వేగంగా దూసుకువెళ్తుంది : కిషన్ రెడ్డి

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా ముందుకు దూసుకువెళ్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో 2 వేల 5 వందల నుంచి 5 వేలకు నేషనల్ హైవేలకు చేరుకున్నాయని చెప్పారు. జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధికి కేంద్రం ఎంతో అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు.  రూ. 720 కోట్లతో ఎస్ఈ రైల్వే అభివృద్ధి పనులను చేపట్టామని రూ. 1900 కోట్లతో హైదరాబాద్, వరంగల్ రాహదారిని మంజూరు చేశామని వెల్లడించారు.  

వరంగల్ లో రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఏడాదికి 2 వేల రైలు వ్యాగన్లు.. వరంగల్ నుంచి ఉత్పత్తి అవుతాయని కిషన్ రెడ్డి  తెలిపారు.  నెలకు 200 వ్యాగన్ల తయారీనే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.  దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి కలుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.  

హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీసీ మంజూరు చేసిందిని ఆయన  వెల్లడించారు.  రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.  ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి నితిన్ గడ్కరి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్  పాల్గొన్నారు.