గాంధీలో టీకా వేయించుకున్న కిషన్ రెడ్డి

గాంధీలో టీకా వేయించుకున్న కిషన్ రెడ్డి

హైదరాబాద్ : వ్యాక్సిన్ విషయంలో భయాలొద్దన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అర్హులంతా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ, మంత్రి ఈటల వ్యాక్సిన్ వేయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇవాళ గాంధీలో వ్యాక్సిన్ వేసుకున్నారు కిషన్ రెడ్డి. కరోనా నియంత్రణలో గాంధీ సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. దేశవ్యాప్తంగా 10 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. వీటిని 20 వేలకు పెంచుతామన్నారు కిషన్ రెడ్డి. కొవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ ఉంటుందన్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ సెంటర్స్ లో ఉచితంగా, ప్రైవేట్ లో 250 రూపాయలకు టీకా అందుబాటులో ఉందన్నారు.