గజ్వేల్ ప్రజలు పులిపిల్లలు.. డబ్బులకు అమ్ముడుపోరు: కిషన్ రెడ్డి

గజ్వేల్ ప్రజలు పులిపిల్లలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో  ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. కేసీఆర్ నియంత పాలనకు గజ్వేల్ నుంచే చరమగీతం పాడాలన్నారు.   రాష్ట్రంలో గజ్వేల్ నుంచే మార్పు జరగాలన్నారు.  గజ్వేల్  ప్రజలు అంగట్లో పశువుల లాగ డబ్బులిస్తే ఓట్లు వేస్తారని.. కేసీఆర్ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు.  గజ్వేల్ లో 30 వేల కుటుంబాల భూములను  లాక్కున్న కర్కోటకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. 

రాష్ట్రంలో మాఫియా విలయతాండవం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. గజ్వేల్ లో డబుల్ బెడ్రూం  ఇండ్లు ఇస్తానని  ఇంతవ రకు ఇవ్వలేదన్నారు.  రాష్ట్రంలో  ఎమ్మెల్యేను కలవని  ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది గజ్వేల్ ప్రజలేనన్నారు.

ALSO READ : 3 గంటల కరెంట్ అని ఎక్కడ చెప్పామో చూపించండి... కేసీఆర్కు రేవంత్ సవాల్

ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారనగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయిండని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతారని అన్నార. పిల్లల భవిష్యత్ కోసం బీజేపీకి ఓటు వేయాలనికోరారు కిషన్ రెడ్డి.