మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్ కొత్త నాటకాలు : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ పని అయిపోయిందని, అందుకే బీఆర్ఎస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్ కొత్త నాటకాలు మొదలుపెట్టిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. మాయమాటలు, మూటలతో టీఆర్ఎస్ గెలవలేదన్నారు.మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ కు చివరి ఎన్నిక  కావాలన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డికి మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు.

ముగిసిన  నామినేషన్ల పర్వం

మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది.   దాదాపు 129 మంది అభ్యర్థులు, మొత్తం 187 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు భూ నిర్వాసితులు, ఓయూ స్టూడెంట్స్, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఇవాళ, రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17 చివరి తేదీ.  నవంబర్ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 6న ఓట్లు లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక టీఆర్‌ఎస్ పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. వీరి మధ్యే ప్రధానమైన పోటీ ఉండనుంది.