కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూములపై ‘స్టే’ విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. 400 ఎకరాల్లో  పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందన్నారు. 

అటవీసంపద విధ్వంసాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉదయం నుంచి చెట్ల నరికివేతను కొనసాగించడం దురదృష్టకరమన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చి బౌలి భూముల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవాలని, ముఖ్యంగా సీఎం రేవంత్​తన అహాన్ని పక్కనపెట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కేంద్రమంత్రి సూచించారు. అలాగే అరెస్టు చేసిన హెచ్​సీయూ విద్యార్థులను  విడుదల చేయాలని డిమాండ్ చేశారు.