ఇయ్యాల ఖమ్మంకు కిషన్ రెడ్డి.. అమిత్ షా సభ ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారు. ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం రానున్న నేపథ్యంలో.. సభ ఏర్పాట్లను ఆయన పరిశీలిం చనున్నారు. ఖమ్మం టౌన్ లో జరగనున్న సభకు సంబంధిం చిన ఏర్పాట్లు, జన సమీకరణపై ఆ జిల్లా పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పరమైన ప్రోగ్రామ్ ల స్పీడప్ పై కూడా కిషన్ రెడ్డి వారితో చర్చించనున్నారు.