రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్ రెడ్డి

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ భేటీలో ఆయా శాఖలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్‌‌ ధన్ ఖడ్ ను కూడా కిషన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, సహాయ మంత్రి సతీశ్ దూబేకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు.