రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కల్యాణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ సమర్పించారు. అలాగే టీటీడీ చైర్మన్ సీతారాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ ఏడాది శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతి ఇచ్చారు. దీంతో భద్రాద్రి భక్త జనసందోహంగా మారింది.
భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు