దివ్యాంగుల రిజర్వేషన్ ను 4శాతానికి పెంచిన ఘనత మోడీదే: కిషన్ రెడ్డి

దివ్యాంగులకు 3 శాతం ఉన్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దివ్యాంగులకు 3వేల పింఛన్లు వచ్చేందుకు పోరాటం చేశామన్నారు. మార్చి 1వ తేదీ శుక్రవారం సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర, రోడ్ షో లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మళ్లీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం.. మోడీ సర్కార్ అని చెప్పారు. అంగవైకల్యంతో ఉన్న వారిని దివ్యాంగులని సంబోదించాలని చెప్పడమే కాకుండా అలానే పిలవాలని ప్రధాని మోడీ జీఓ తీసుకు వచ్చారన్నారు. 

ALSO READ :- జగన్ పార్టీకి ఓటు వేయద్దు - వైఎస్ సునీత..!

గతంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసి పెన్షన్ సాధించుకున్నామని గుర్తు చేశారు. ఏళ్ల వేళల నరేంద్ర మోడీ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.