హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కొత్త ఇన్ చార్జిగా పార్టీ ఎవ్వరిని నియమించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ గా అభయ్ పాటిల్ ను నియమించినట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
అభయ్ పాటిల్ ను పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ గా కేంద్ర పార్టీ నియమించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఇన్ చార్జ్ గా కొత్తగా ఎవ్వరిని నియమించలేదని వెల్లడించారు.