ప్రజలు కోరుకుంటున్న పాలన బీజేపీ మాత్రమే అందిస్తుంది

ప్రజలు కోరుకుంటున్న పాలన బీజేపీ మాత్రమే అందిస్తుంది

రాష్ట్రంలో ప్రస్తుతమున్న నియంత, అవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎంతోమంది త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంధీగా మారిందన్నారు.  ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుకున్నారో.. అలాంటి పాలన కేవలం బీజేపీనే అందించగలదని చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట నుంచి ఆరుగురు సర్పంచులు ఒక ఎంపీటీసీ..  బీజేపీలో చేరిన సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దిపాయపల్లి సర్పంచ్ లావణ్య, తెల్కపల్లి సర్పంచ్ ప్రియాంక,  కొనాయ పల్లి సర్పంచ్ సురేందరరెడ్డి, ముత్యం పేట గ్రామ సర్పంచ్ బాబోయి రాజు,   లింగాయప్లలి తాండా సర్పంచ్  దేవి యాదగిరి,  ఎంపీటీసీ శ్రీనివాస్ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.