ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ తలుచుకుంటే చేసి చూపిస్తారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ఎస్సీ వర్గీకరపై హామీ ఇవ్వగానే ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను మోదీ అర్థం చేసుకున్నారని.. దశాబ్ధాల నాటి సమస్యను మోదీ పరిష్కరిస్తున్నారని చెప్పారు. వర్గీకరణకు అనుకూలమని కాంగ్రెస్ చెప్పినా ఏం చేయలేదన్నారు.
అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేదే మోదీ ప్రయత్నమని కిషన్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గరీకరణపై గతంలో ఎన్నో కమిటీలు వేశారని.. గతంలో ఏ ప్రధానులు కూడా సీరియస్ గా తీసుకోలేదన్నారు. ఏండ్ల తరబడి కాంగ్రెస్ సమస్యను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిందని విమర్శించారు. ఏ ప్రభుత్వాలు వర్గీకరణపై చిత్తశుద్దితో పనిచేయలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్సే మొదటి ముద్దాయన్నారు.
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ వేస్తుందని.. వర్గీకరణ సమస్యకు బీజేపీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు కిషన్ రెడ్డి. న్యాయపరంగా..చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కొంతమంది రాజకీయనాయకులు కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్లు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీవర్గీకరణపై న్యాయం చేయడానికి వారికి అన్ని విధాల సహకరిస్తామన్నారు కిషన్ రెడ్డి.
ALSO READ :- హైదరాబాద్ నుంచి రోజుకు 3 వేల పాస్ పోర్టులు జారీ