తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన మరో చరిత్రగా నిలిచిపోతుందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో పసుపు బోర్టు, ట్రైబల్ వర్శిటీ ఏర్పాటు గర్వించదగ్గ విషయం అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు పసుపుబోర్టు కోసం పోరాడుతున్నారని చెప్పారు. పాలమూరు ప్రజాగర్జన సభలో మాట్లాడిన ఆయన .. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఏరకమైన ప్రభుత్వం ఉందో చూడాలన్నారు. దేశంలో కేసీఆర్ లా వ్యవహరించే సీఎంను ఎక్కడా చూడలేదన్నారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి పీఎం వస్తే.. సీఎంకు తీరికా ఉండదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేస్తుంటే తమకేం ఇచ్చారు, ఫాంహౌస్ కు ఏమిచ్చారన్నట్టుగా వాళ్ల తీరుందని మండిపడ్డారు.
తెలంగాణకు కేంద్రం 9లక్షల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు కిషన్ రెడ్డి. రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా సీఎం కేసీఆర్ హజరు కాలేదన్నారు. 33 వేల కోట్లతో అనేక రైల్వే ప్రాజెక్టులు ప్రారంభిస్తే కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధితో కేసీఆర్ కు అవసరం లేదని.. కొడుకును సీఎం చేయడం తప్ప మరో ధ్యాస లేదని ధ్వజమెత్తారు.
Also Read :- కేసీఆర్కు తీరిక లేదు..
బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్టేనన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీల డీఎన్ ఏ ఒక్కటేనని తెలిపారు కిషన్ రెడ్డి.కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని గెలిపిస్తే నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పారు.