హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ వల్లే రాష్ట్రం పూర్తిగా నాశనమైందని బీజేపీ స్టేట్చీఫ్, కేంద్రమంత్రికిషన్రెడ్డి అన్నారు. అతి తక్కువ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ కూలి కనుమరుగు కాబోతోందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పదేళ్లు అధికారంలో ఉండి రూ.లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కేటీఆర్‌ను చూసి జాలిపడాలి. ఓటమి తర్వాత కూడా ఆయనే సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నరు. కేవలం ఆ విషయంలోనే ఆయన బాధపడుతున్నరు.. రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండినందుకు కాదు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది.ప్రజల బ్రతుకులు మారలేదు’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.