సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదు: కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరసారి స్పష్టం చేశారు. దీనిపై  రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని .. ప్రధాని మోడీ  కూడా సింగరేణిప ప్రైవేటీకరణపై క్లారిటీ  ఇచ్చారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారని కేసీఆర్ కుటుంబం విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. బీజేపీని ప్రజలు ఆదరించడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. ఏ రాష్ట్రంపై కేంద్రానికి వివక్ష ఉండదన్నారు. 

బొగ్గు గనులను బహిరంగ వేలం ద్వారనే కేటాయిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో బొగ్గుగనుల కేటాయింపుల్లో  చాలా కుంభకోణాలు జరిగాయని..వాటన్నింటిని నరేంద్రమోడీ ప్రక్షాళన చేశారన్నారు.  తెలంగాణకు ఇవ్వకుండా గుజరాత్ కు బొగ్గుగణులు కేటాయిస్తున్నారని టీఆర్ఎస్  ప్రచారం చేస్తుందన్నారు. ఏ ఒక్క కోల్ బ్లాక్ ను  ఇష్టానుసారంగా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పారదర్శకంగా బొగ్గుగణుల వేలం జరుగుతుందన్నారు.