హిందీని ఏ రాష్ట్రంపై బలవంతంగా అమలు చేయబోం: కిషన్ రెడ్డి

హిందీని ఏ రాష్ట్రంపై బలవంతంగా అమలు చేయబోం: కిషన్ రెడ్డి

ఏ రాష్ట్రంపై కేంద్రం బలవంతంగా హిందీని రుద్దబోదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. త్రిభాషా విధానంపై డీఎంకే  రాజకీయం చేస్తుందన్నారు. రూపీ సింబల్ ను మార్చడం డీఎంకే దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో లబ్ధి కోసమే డీఎంకే, కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డీఎంకే సర్కార్ పై తమిళనాడు ప్రజల్లో అసహనం పెరుగుతోందన్నారు.

ఆల్ పార్టీ మీటింగ్ కూడా స్టాలిన్ ఎన్నికల ఎత్తుగడ అని విమర్శించారు కిషన్ రెడ్డి. ప్రాంతీయ భాషలు ప్రోత్సహించాలని మొదట నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. రాజగోపాలచారి ఆలోచనతోనే త్రిభాషా సిద్ధాంతం అమల్లోకి వచ్చిందన్నారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్, డీఎంకే దివాళ కోరు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి.  వచ్చే ఎన్నికల కోసమే స్టాలిన్ ఆరాటపడుతున్నారు..అందుకే ప్రతీది రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.