
తెలంగాణలో పొత్తు లేకుండా 8 స్థానాలు గెలవడం పార్టీ చరిత్రలో రికార్డ్ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కార్యకర్తల కష్టం వల్లే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు. పార్టీ చరిత్రలో తెలంగాణలో గొప్ప విజయం సాధించామన్నారు. మోదీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మోదీ, బీజేపీపై విశ్వాసంఉంచారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తగా పనిచేసిన నర్సాపురం ఎంపీకి కేంద్రమంత్రి పదవి రావడం బీజేపీ సిద్ధాంతాలకు నిదర్శనమన్నారు. సాధారణ కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. తెలగాణలో కేంద్రం గత పదేళ్లలో 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. గత పదేళ్లుగా పనిచేసినట్లే ఈ ఐదేళ్లు కష్టపడి పనిచేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తాం. కష్టపడి పనిచేస్తే బీజేపీలో తప్పకుండా పదవులు వస్తాయని కిషన్ రెడ్డి అన్నారు.