ఏ దేశం చేయని గొప్ప కార్యక్రమం భారత్ చేసింది

ఏ దేశం చేయని గొప్ప కార్యక్రమం భారత్ చేసింది
  • ఏ దేశం చేయని గొప్ప కార్యక్రమం భారత్ చేసింది
  • కళాకారులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్రం రెడీ


హైదరాబాద్: తెలంగాణలో హునర్ హాట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం సికింద్రాబాద్ లో జరిగిన హునర్ హాట్ కార్యక్రమం పాల్గొని మాట్లాడారు కిషన్ రెడ్డి. "గతంలో హునర్ హాట్ కార్యక్రమం కరోన వల్ల వాయిదా పడింది. ఈ ప్రదర్శన కోసం అనేక రాష్టాలు పోటీ పడ్డాయి. తెలంగాణలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో హునర్ హాట్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రస్తుతం మాస్క్ ధరించడం లేదు. ప్రజల్లో ధైర్యం వచ్చింది. ఏ దేశం చేయని గొప్ప కార్యక్రమం భారత్ చేసింది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది. హైదరాబాద్ కు చెందిన ఫార్మా సూటికల్ కంపెనీ వ్యాక్సిన్ ను మార్కెట్ లో తేవడం సంతోషం. 180 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ప్రధాని మోడీ 150 దేశాలకు భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ పంపించారు. 300 హస్త కళల స్టాల్స్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులు ఇష్టమైన కళారూపాలు కొనుగోలు చేసుకోవచ్చు. 730 కోట్లు మైనార్టీ శాఖకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తోంది. 450 మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఫెలో షిప్ అందిస్తుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమాన్ని ఈఏడాది హైదరాబాద్ లో జరుపనున్నాం. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పద్మ అవార్డు గ్రహీతలు, ఇతర మేధావులు, కళాకారులు పాల్గొంటారు. హునర్ హట్ లో ఎన్నో కళా ప్రదర్శనలు దర్శనమిస్తాయి. వాటిని రూపొందించేందుకు కళాకారులు ఎంతో కష్టపడ్డారు. కళాకారులు, శ్రామికులను ప్రోత్సహించాలి. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించండి. వచ్చే నెల 6వ తేదీ వరకు హునర్ హాట్ కొనసాగుతుంది. మీరు కొన్నా, కొనకపోయినా వచ్చి చూడండి.. మన కళాకారుల నైపుణ్యం మీకు తెలుస్తుంది. కళాకారులకు కేంద్రం బ్యాంక్ రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది". అని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి: 

కూతురు మృతి.. దుఃఖాన్ని దిగమింగి సెంచరీ చేశాడు

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్.. ధోని న్యూలుక్ అదిరింది