సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ నేతలు రైతులను గందరగోళంలోకి నెట్టొందన్న ఆయన.. ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఇష్యూ లేదన్నారు. ఎక్కడా లేని సమస్యను టీఆర్ఎస్ నేతలు సృష్టిస్తున్నారని.. పంటలపై రాష్ట్ర సర్కార్ దగ్గర సరైన ప్రణాళిక కూడా లేదని తెలిపారు. ఈ సీజన్ లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందన్న కిషన్ రెడ్డి.. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని స్వయానా సీఎం కేసీఆరే కేంద్రానికి లెటర్ ఇచ్చారన్నారు. పుత్రవాత్సల్యం పేరుతో రైతులను బలి చేయవద్దని.. దొడ్డు వడ్లు కాకుండా ఇతర ధాన్యాలు లేవా అని ప్రశ్నించారు. కల్లాల్లో ఉన్న వడ్లన్నీ కొనాలని రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణాలో నాసిరకం విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయని..వాటిని అరికట్టలెకపోతున్నారన్నారు.
ముఖ్యమంత్రి తెలంగాణను ధాన్య బండాగారాన్ని చేస్తా అన్నాడు ...మరి ఇప్పుడు ఏమి అయిందన్నారు. కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నా..వారిని అదుకోడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని తెలిపారు. చాలా మంది కౌలు రైతులు ఆత్మహత్యాలు చేసుకుంటున్నారన్న కిషన్ రెడ్డి..ప్రతి సంవత్సరం మే నెలలో రైతులు ఏ పంట వేయాలో అనే ప్రణాళిక ఉంటది ...కానీ ఈ ప్రభుత్వనికి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఒకసారి ఒక్కో మాట మాట్లాడుతారని.. ఒకసారి సన్న బియ్యం ..ఒకసారి పత్తి వేయమంటారని చెప్పారు. హుజూరబాద్ ఎన్నికల ఓటమిపై కేసీఆర్ కుటుంబానికి సానుభూతి తప్ప మేము ఏమి చేప్పలేమన్నారు. కేంద్రం ప్రతి సంత్సరం ధాన్యం కొనుగొలు చేస్తుందని... బాయిల్ రైసు రాకుండా రైతులకు సరైన విత్తనాలు అందుబాటులొ ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. హుజూరబాద్ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకొలేకపోతున్నారని.. కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ప్రజల్ని గందరగోళంలోకి గురి చేసి కుట్రకు పాల్పడుతున్నారని తెలిపారు కిషన్ రెడ్డి.