
తెలంగాణలో 10 నేషనల్ హైవేలను పూర్తి చేశామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రూ.6280కోట్లతో 285 కి.మీ కొత్త జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు. రహదారుల ప్రారంభానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తారన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత కొత్త హైవేలను నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని చెప్పారు కిషన్ రెడ్డి.
రీజినల్ రింగ్ రోడ్ గురించి నితిన్ గడ్కరీతో చర్చించామన్నారు కిషన్ రెడ్డి. ఫైనాన్స్ కు సంబంధించి ట్రై పార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి రూ 18 వేల 772 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ నోట్ కూడా రెడీ అవుతున్నట్లు వెల్లడించారు.
ALSO READ | తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి.. పార్లమెంట్లో ప్రశ్నించాలి: భట్టి విక్రమార్క
ఏప్రిల్ నెలలో బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తవుతుందన్నారు కిషన్ రెడ్డి. ఆరంఘర్ నుంచి శంషాబాద్ కు ఆరు లేన్ల హైవే పూర్తయిందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే వాళ్ల కోసం సిగ్నల్ ఫ్రీ రోడ్ పూర్తయిందన్నారు. బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ పూర్తయతే కూకట్ పల్లి ,పటాన్ చెరు మద్య ట్రాఫిక్ తగ్గుతుందన్నారు కిషన్ రెడ్డి.