హెచ్‌‌‌‌‌‌‌‌సీయూ భూముల వేలంపై .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

హెచ్‌‌‌‌‌‌‌‌సీయూ భూముల వేలంపై .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనికరం లేకుండా పాలన సాగిస్తున్నదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలం నిర్ణయం క్రూరమైన చర్య అని సోమవారం ‘ఎక్స్’లో మండిపడ్డారు. ‘‘ప్రతిపక్షాల గొంతు నొక్కడం, విద్యార్థులను అణచివేయడం, చెట్లను నరికివేయడం, పచ్చదనం – జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం, నిధుల కోసం హైదరాబాద్ పర్యావరణాన్ని త్యాగం చేయడం.. ఇది తెలంగాణలో కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం’’అంటూ విమర్శలు చేశారు. 

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయడం వల్ల ఈ ప్రాంతంలోని గొప్ప వృక్ష, జంతుజాలం తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఈ ప్రాంతాన్ని బుల్డోజర్లతో చదును చేస్తుండగా నెమళ్లు, ఇతర పక్షులు కేకలు వేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు.  విద్యార్థుల గొంతులను రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూరంగా అణచివేస్తున్నదని మండిపడ్డారు.