తెలంగాణలో తమ పార్టీ రోజురోజుకు బలపడుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపు ఇచ్చారు.
100 మందితో సభ్యత్వం చేయిస్తే.. క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. దేశం కోసం పాటుపడే పార్టీ బీజేపీ మాత్రమే నన్నారు . కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు కుటుంబ ప్రయోజనం కోసమే పనిచేస్తాయని విమర్శించారు.
ALSO READ | పీఓకే నివాసితులు భారత్లో చేరాలి..మా వారిగా పరిగణిస్తాం:రక్షణమంత్రి రాజ్నాథ్