నాది తహశీల్దార్ వచ్చే స్థాయి కూడా కాదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నాది తహశీల్దార్ వచ్చే స్థాయి కూడా కాదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నాలాపై పడ్డ చెట్లు, చెత్తను తొలగించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నారాయణ గూడ,హిమాయత్ నగర్, ఖైరతాబాద్ ఏరియాల్లోని ముంపు ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటించారు. బాధితుల ఇబ్బందులను ఆరా తీసిన కేంద్రమంత్రి…అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలన్నారు. వరద బాధితులను పరామర్శించేటపుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక్కరు కూడా  ఉండరా? కనీసం తహసీల్దార్ కూడా రారా అంటూ సీరియస్ అయ్యారు.

గతేడాది కంటే పెరిగిన ప్రధాని మోడీ సంపాదన