అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.   అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో  హుటాహూటిన ఢిల్లీకి బయలుదేరారు. ఎన్నికల అభ్యర్థిల జాబితాపై చర్చించేందుకు  కిషన్ రెడ్డికి పిలుపు అందంది. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ బయలుదేరారు. 

2023 అక్టోబర్ 15 లేదా 16న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను  బీజేపీ వెల్లడించే అవకాశం ఉంది.  ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది.  ప్రధాని  మోదీ రెండు సార్లు, అమిత్ షా ఒకసారి రాష్ట్రంలో పర్యటించారు.