పంట బీమా అడిగితే నిర్లక్ష్యమా..? 

పంట బీమా అడిగితే నిర్లక్ష్యమా..? 

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .మహబూబ్ నగర్ లో పర్యటించిన ఆయన  సీఎం కేసీఆర్ రైతులను  పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో నేతలకు డబ్బులు పంచుతున్నాడని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. అకాల వర్షాలకు ఇక్కడి రైతాంగం నష్టపోతే బీఆర్ఎస్ నాయకులు నాందేడ్ లో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

పేదలకు డబల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించకుండా.. ప్రగతి భవన్, సచివాలయాన్ని రికార్డ్ సమయంలో కట్టానని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని కోరారు. మే 30 నుంచి జూన్ 30 వరకు జరిగే  మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాకి ప్రజలు మద్దతివ్వాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.