
- సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్
- 44 రన్స్ తేడాతో రాజస్తాన్‌పై గెలుపు
- చెలరేగిన హెడ్, క్లాసెన్, నితీశ్
హైదరాబాద్ : ఐపీఎల్–18లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇషాన్ కిషన్ (47 బాల్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్) ఊచకోత.. ట్రావిస్ హెడ్ (31 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67) మెరుపులతో ఆదివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 44 రన్స్ తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడిన హైదరాబాద్ 20 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30) రాణించారు.
తుషార్ దేశ్‌పాండే 3 వికెట్లు తీశాడు. తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 242/6 స్కోరుకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70), సంజూ శాంసన్ (37 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66), హెట్‌మయర్ (42), శుభమ్ దూబే (34 నాటౌట్) చెలరేగినా ప్రయోజనం దక్కలేదు. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఫ్లాట్ వికెట్‌పై బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. తొలి ఓవర్ నుంచే హెడ్, అభిషేక్ (24) బౌండ్రీల మోత మోగించారు. థర్డ్ ఓవర్‌లో అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్లు, హెడ్ సిక్స్‌తో మరో మెట్టు ఎక్కింది. అయితే నాలుగో ఓవర్‌లో తీక్షణ (2/52).. అభిషేక్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 45 రన్స్ భాగస్వామ్యాన్ని ముగించాడు. ఈ దశలో వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు ఫోర్లతో మొదలుపెట్టి ఇన్నింగ్స్ మధ్యలో విధ్వంసం సృష్టించాడు.
ఆరో ఓవర్‌లో హెడ్, ఇషాన్ మూడు ఫోర్లు కొట్టడంతో హైదరాబాద్ 94/1తో పవర్‌ప్లేను ముగించింది. ఆ వెంటనే ఇషాన్ మరో రెండు బౌండ్రీలు రాబట్టగా, హెడ్ 21 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 8, 9 ఓవర్లలో కాస్త నెమ్మదించిన వీళ్ల జోరుకు 10వ ఓవర్‌లో తుషార్ అడ్డుకట్ట వేశాడు. హెడ్‌ను ఔట్ చేసి రెండో వికెట్‌కు 85 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. నితీశ్ రెడ్డి వచ్చి రావడంతో బౌండ్రీల మోత మోగించాడు. 13వ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో ఇషాన్ 25 బాల్స్‌లో ఫిఫ్టీ మార్క్‌ను సాధించగా 22 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో 18 రన్స్ రాబట్టిన నితీశ్‌ను 15వ ఓవర్‌లో తీక్షణ వెనక్కి పంపడంతో మూడో వికెట్‌కు 27 రన్స్ జతయ్యాయి.
ఈ క్రమంలో స్కోరు 208/3కి చేరింది. ఈ దశలో వచ్చిన క్లాసెన్ (37) కూడా ఎక్కడా తగ్గలేదు. 17వ ఓవర్‌లో 6, 4తో జోరందుకున్న అతను 18వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. కానీ 19వ ఓవర్‌లో వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇదే ఓవర్‌లో ఇషాన్ రెండు సిక్స్‌లతో 45 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌లో అనికేత్ (7), అభినవ్ మనోహర్ (0) వరుస బాల్స్‌లో ఔట్‌కావడంతో గత అత్యధిక స్కోరు (287/3)ని అధిగమించలేకపోయింది.
జురెల్, శాంసన్ పోరాటం వృథా
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో రాజస్తాన్ కూడా గట్టిగా పోరాడింది. స్టార్టింగ్‌లో 50 రన్స్‌కే యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) ఔటైనా శాంసన్, ధ్రువ్ జురెల్ దుమ్మురేపారు. వీరిద్దరు పోటీపడి బౌండ్రీలు, సిక్స్‌ల మోత మోగించారు. పవర్‌ప్లేలో 77/3 ఉన్న స్కోరును తొలి 10 ఓవర్లలో 118/3కి పెంచారు. ఈ క్రమంలో శాంసన్ 26, జురెల్ 28 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు చేశారు. 13వ ఓవర్‌లో జురెల్ మూడు సిక్స్‌లు కొట్టగా, శాంసన్ రెండు ఫోర్లు బాదాడు.
కానీ మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌కావడంతో నాలుగో వికెట్‌కు 111 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. చివర్లో హెట్‌మయర్, దూబే ధనాధన్ షాట్లతో రెచ్చిపోయారు. 17వ ఓవర్‌లో దూబే మూడు సిక్స్‌లు దంచాడు. 18వ ఓవర్‌లో హెట్‌మయర్ 4, 6, దూబే 6, 4తో 22 రన్స్ రాబట్టారు. ఆ వెంటనే మరో రెండు సిక్స్‌లు కొట్టిన హెట్‌మయర్ ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఆరో వికెట్‌కు 80 రన్స్ జత చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 286/6 (ఇషాన్ కిషన్ 106*, హెడ్ 67, తుషార్ దేశ్‌పాండే 3/44, మహీశ్ తీక్షణ 2/52). రాజస్తాన్: 20 ఓవర్లలో 242/6 (ధ్రువ్ జురెల్ 70, శాంసన్ 66, హెట్‌మయర్ 42, సిమర్‌జిత్ 2/46, హర్షల్ పటేల్ 2/34).