
బెంగళూరు: ఏబీసీడీ మూవీ ఫేమ్, డ్యాన్సర్ కిషోర్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్, మిథైలీన్ డయాక్సీమెథపేటమైన్‌ను అమ్ముతున్నారనే కారణంతో కిషోర్‌తోపాటు అకీల్ నౌషీల్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కిషోర్, అకీల్ మహారాష్ట్రలోని ముంబై నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి కర్నాటకలోని మంగళూరులో అమ్మడానికి యత్నిస్తుండగా పట్టుకున్నామని మంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితుల నుంచి ఎండీఎంఏ, బజాజ్ డిస్కవరీ బైక్, రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లాంటి పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపెంట్ అయిన కిషోర్.. ఏబీసీడీ: ఎనీ బడీ కెన్ డ్యాన్స్‌లో నటించాడు.