జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన బందోబస్త్ ఏర్పాట్లను శనివారం వరంగల్ సీపీ అంబర్ కిశోర్‌ఝా పరిశీలించారు. పట్టణంలోని గీతానగర్‌లో నిర్వహించను సభా ప్రాంగణంతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. బారికేడ్ల ఏర్పాటు, బహిరంగ సభా వేదిక, సభకు వచ్చే ప్రజలు, సభకు వెళ్లే మార్గాలు, వీఐపీ మార్గాలతో పాటు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆఫీసర్లకు సూచనలు ఇచ్చారు.
సీపీగా చార్జ్ తీసుకున్న అనంతరం ఫస్ట్‌టైం జనగామకు వచ్చిన ఆయనకు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్ యాదవ్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట క్రైం డీసీపీ దాసరి మురళీధర్, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.