Kismath OTT: సైలెంట్గా OTTకి వచ్చిన కిస్మత్.. ఈ కామెడీ థిల్లర్ ఎక్కడ చూడొచ్చంటే?

నటులు న‌రేష్ అగ‌స్త్య‌(Naresh Agastya), అభిన‌వ్ గోమ‌టం(Abhinav Gotam), విశ్వ‌దేవ్(Vishwadev) ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కిస్మత్(Kismath). దర్శకుడు శ్రీనాథ్(Srinath) తెరకెక్కించిన ఈ సినిమాలో మరో నటుడు అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) కీ రోల్ చేశారు. కామెడీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది కానీ, రిలీజ్ తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. 

నిజానికి కిస్మత్ సినిమా థియేటర్స్ కు వచ్చినరోజే మరో ఎనిమిది సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమాను ఓటీటీకి తెచ్చేందుకు ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఎలాంటి ప్రకటన లేకుండా ఏప్రిల్ 2నుండి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ఇక కిస్మత్ సినిమా కథ విషయానికి వస్తే.. చదువు పూర్తయిన ముగ్గురు కుర్రాళ్లు ఊళ్ళో జరిగిన గొడవల కారణంగా హైదరాబాద్ కు వస్తారు. బ్యాక్ డోర్ లో ఉద్యోగం కోసం ఒక కంపెనీలో డబ్బులు కడతారు కానీ, ఆ కంపెనీ ఎత్తేయడంతో వాళ్ళ జీవితాల్లో కష్టాలు మొదలవుతాయి. అనుకోకుండా ఒకరోజు వారికి డబ్బు దొరుకుతుంది. అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. ఆ డబ్బు ఎవరిదీ? ఆ డబ్బును ఆ ముగ్గురు ఎం చేశారు? దానికి పొలిటీషియన్స్ కి ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ. 

ALSO READ :- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీకి షాక్.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్

 

 

 

 

  •  

  •  
  • Beta
Beta feature