డ్రగ్స్ కేసులో జైలు నుండి రిలీజైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా

డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా జైలు నుండి విడుదల జైలు నుండి విడుదలైంది. విధాయుధాలైన అనంతరం  ఆమె తల్లి ప్రమీలా పెరీరాతో మాట్లాడిన వీడియోను ఆమె సోదరుడు కెవిన్‌ పెరీరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసాడు. ఈ వీడియోలో క్రిసాన్  విడులైందని.. వచ్చే 48 గంటల్లో ఆమె భారత్‌కు తిరిగి వస్తుందని వీడియోలో పేర్కొన్నారు కెవిన్. డ్రగ్స్‌ ఆరోపణలతో ఆమె ఈ నెల 1న షార్జాలో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే పథకం ప్రకారమీ ఆమెను ఈ కేసులో ఇరికించారని, దీనివెనుక పెద్ద కుట్ర జరిగిందని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గుర్తించారు.

ఇందులో భాగంగానే అసలు నిందితులు ఆంథోనీ పాల్‌, అతని సన్నిహితుడు రాజేష్‌ బబొటేలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలు ఎం జరిగింది అంటే .. క్రిసాన్ పెరారీ తల్లి పెంచుకుంటున్న కుక్క కారణంగా ఆమెకు, ఆంథోనీ సోదరికి గతంలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆంథోనీ.. ఓ అంతర్జాతీయ వెబ్‌ సిరీస్‌ కోసం ఆమెను షార్జాకి రప్పించి, ట్రోఫీలో డ్రగ్స్‌ దాచిపెట్టారు. ఇక ఆమె తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా, డ్రగ్స్‌ దాచిన ట్రోఫీని ఆమెకు అందించారు. దీంతో ఆమెను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత.. మీ కూతురు అరెస్ట్ అయ్యింది అని చెప్పి, ఆమెను జైలు నుండి బయటకు తీసుకురావాలంటే రూ. 80 లక్షలు ఇవ్వాలని క్రిసాన్  తల్లిని డిమాండ్‌ చేశారు. ఇక కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న భారత అధికారులు సంబంధిత ఆధారాలను షార్జా అధికారులకు పంపడంతో ఆమెను బుధవారం విడుదల చేశారు.