
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధుకి జంటగా వైష్ణవి చైతన్య నటిస్తోంది. లేటెస్ట్గా (మార్చి 20న) ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్.
'కిస్' (Kiss Song)పేరుతో విడుదలైన ఈ సాంగ్ క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రేండింగ్కి వచ్చింది. సురేష్ బొబ్బిలి స్వరాలూ సమకూర్చిన ఈ పాటకు సనోరే లిరిక్స్ అందించారు. జావేద్ అలీ, ఆమల చెబోలు పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ అందించారు.
లిరిక్ విషయానికి వస్తే.. తన ప్రేయసితో ఓ ముద్దు కోసం ఆరాటపడే సిద్దు చెప్పిన ఈ మాటతో షురూ అయింది. 'ఈ హైదరాబాద్ మొత్తంలో నాకంటూ ఓ ముద్దు పెట్టుకోవడానికి ప్రైవసీ ప్లేస్ లేకపోవడమా' అంటూ మొదలెట్టిన ఆ వైఖరి బాగుంది.
"భాగ్యనగరం అంతా.. మనదే మనదే, నీ బాధే తీరుస్తానే పదవే పదవే.. జంటై పోదామందే..పెదవే.. పెదవే, దునియాతో పని లేదింక.. పదవే.. పదవే, హే ముద్దు.. ముద్దుగా ముద్దివ్వమందిగా.. ముద్దుగుమ్మిలా ఉన్న పాటుగా, ముద్దు పెట్టడం ఏమంత తేలికా.. చుట్టుపక్కలంతా ఉండగా.. " అనే లిరిక్స్ కుంటున్నాయి.
ఇందులో సిద్ధు-వైష్ణవి కెమిస్ట్రీ బాగుంది. ప్రేమలో ఉండే ఆ చిలిపితనం, ఒక్క ముద్దు కోసం ప్రేయసితో ఆరాటపడే ఆ ఫీల్, పాటలో వచ్చే విజువల్స్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. మొత్తంగా ఈ కిస్ పాటకు మంచి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి.
లవ్ & ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకి పెట్టింది పేరైన ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత కొల్ల అవినాష్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జాక్ ఏప్రిల్ 10 థియేటర్స్ కి రానుంది.