
Sreeleela Special songs: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా 'పుష్ప 2 ది రూల్'. ఈ సినిమాలో' కిస్సిక్' సాంగ్తో మెరిసిన శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగ్స్ కు నో చెప్పాలని డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తనకు ఐటం సాంగ్ సెట్ కాదు అని, కేవలం దాని కోసమే తనను సంప్రదిస్తే కచ్చితంగా నో చెబుతాను అంటూ ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.
పుష్ప-2కు ఉన్న క్రేజ్, పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ కావడంతోనే శ్రీలీల ‘కిస్సిక్' సాంగ్ కు ఒప్పుకున్నట్లు సమాచారం. అటు ఈ నెల 25న ఆమె నటించిన 'రాబిన్ హుడ్' విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మూవీపై శ్రీలీల చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ALSO READ | Sreeleela Marriage: శ్రీలీల పెళ్లి బాధ్యత నాదేనంటున్న బాలయ్యబాబు.. ఎందుకంటే..?
అయితే ప్రస్తుతం శ్రీలీల గ్లామర్ క్వీన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ నుంచి శ్రీలీలకి వరుస ఆఫర్లు కీయవ్వ కడుతన్నాయి. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నాటికన్హే ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల ఒక్కో సినిమాకి బడ్జెట్ ని బట్టి దాదాపుగా 5 నుంచి రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.