కిచెన్ తెలంగాణ: మొక్కజొన్న.. మోర్ టేస్టీ! .. కార్న్ రిబ్స్

కిచెన్ తెలంగాణ: మొక్కజొన్న.. మోర్ టేస్టీ! .. కార్న్ రిబ్స్

మొక్కజొన్న పొత్తుల్ని కాల్చి లేదా ఉడికించి తింటుంటారు. కానీ, వాటితో బోలెడన్ని వెరైటీలు చేయొచ్చు. ఒకటేమో బటర్ బాత్​ చేసిన కార్న్, ఇంకోటేమో ఎర్రని తందూరీ కార్న్.. అంతెందుకు కార్న్​తో ఉప్మా, బ్రెడ్​, కార్న్ కలిపి మసాలా టోస్ట్​ కూడా చేసేయొచ్చు. 

కావాల్సినవి

స్వీట్ కార్న్ : రెండు
ఆలివ్​ నూనె : పావు కప్పు
మిరియాల పొడి : పావు టీస్పూన్
ఆనియన్ పౌడర్ : ఒక టీస్పూన్
గార్లిక్​ లేదా చిల్లీపౌడర్​ : ఒక టీస్పూన్
స్మోక్డ్​ పాప్రిక  : అర టీస్పూన్
ఉప్పు : సరిపడా
కొత్తిమీర, నెయ్యి : కొంచెం

తయారీ : స్వీట్​ కార్న్​ని నిలువుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో ఆలివ్ నూనె, ఆనియన్ పౌడర్, మిరియాల పొడి, గార్లిక్ లేదా చిల్లీ పౌడర్, స్మోక్డ్​ పాప్రిక, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కట్ చేసిన స్వీట్​ కార్న్​కి పూయాలి. పాన్​కి నూనె పూసి, అందులో స్వీట్​ కార్న్​ను వరుసగా పేర్చి, మూత పెట్టి ఓ మాదిరి మంట మీద కాల్చాలి. అవి బాగా ఉడికాక వాటిపై నెయ్యి పూసి, కొత్తిమీర తరుగు చల్లితే కార్న్​ రిబ్స్ రెడీ. వీటిని పాన్​లో కాకుండా గ్రిల్డ్​ పాన్​పై కాల్చొచ్చు లేదా ఒవెన్​లో కూడా ఉడికించొచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన ఆనియన్, గార్లిక్ లేదా చిల్లీ పౌడర్, స్మోక్డ్​ పాప్రిక.. మార్కెట్​లో దొరుకుతాయి.