
మొక్కజొన్న పొత్తుల్ని కాల్చి లేదా ఉడికించి తింటుంటారు. కానీ, వాటితో బోలెడన్ని వెరైటీలు చేయొచ్చు. ఒకటేమో బటర్ బాత్ చేసిన కార్న్, ఇంకోటేమో ఎర్రని తందూరీ కార్న్.. అంతెందుకు కార్న్‌తో ఉప్మా, బ్రెడ్, కార్న్ కలిపి మసాలా టోస్ట్ కూడా చేసేయొచ్చు.
కావాల్సినవి :
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి తరుగు : ఒక టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ తరుగు : ఒక కప్పు
జీలకర్ర పొడి : అర టీస్పూన్
పచ్చిమిర్చి : ఒకటి,
కారం : ఒక టీస్పూన్
గరం మసాలా : పావు టీస్పూన్
ఫ్రెష్ క్రీమ్ : అర కప్పు,
చీజ్ : అర కప్పు
కొత్తిమీర :కొంచెం,
వెన్న : ఒక టీస్పూన్
బ్రెడ్ ముక్కలు – ఆరు
తయారీ : పాన్‌లో నూనె వేడి చేసి వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, మొక్కజొన్న గింజలు ఒకదాని తర్వాత ఒకటి వేగించాలి. అందులో కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, చీజ్ కూడా ఒక్కోటిగా కలపాలి. ఆ తర్వాత పాన్‌లో వెన్న వేడి చేసి బ్రెడ్ ముక్కని అందులో పెట్టాలి. దానిపై కార్న్ మిశ్రమం పెట్టి, చీజ్ చల్లి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. తర్వాత బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి, కొత్తిమీర తరుగు చల్లాలి.