
మొక్కజొన్న పొత్తుల్ని కాల్చి లేదా ఉడికించి తింటుంటారు. కానీ, వాటితో బోలెడన్ని వెరైటీలు చేయొచ్చు. ఒకటేమో బటర్ బాత్ చేసిన కార్న్, ఇంకోటేమో ఎర్రని తందూరీ కార్న్.. అంతెందుకు కార్న్‌తో ఉప్మా, బ్రెడ్, కార్న్ కలిపి మసాలా టోస్ట్ కూడా చేసేయొచ్చు.
కావాల్సినవి :
మొక్కజొన్న కంకులు : మూడు
నీళ్లు : సరిపడా
వెన్న : మూడు టేబుల్ స్పూన్లు
చీజ్ : రెండు స్లైస్‌లు
కొత్తిమీర : కొంచెం
తయారీ : పాన్‌లో నీళ్లు పోసి, ఉప్పు వేయాలి. అందులో మొక్కజొన్న కంకులు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. తర్వాత మరో పాన్‌లో వెన్న కరిగించాలి. తరువాత అందులో మొక్కజొన్న కంకులు వేగించాలి. పైనుంచి కారం చల్లి అటు ఇటు తిప్పాలి. ఆ తర్వాత వాటిపై చీజ్ స్లైస్‌లు వేసి మూతపెట్టాలి. చీజ్ కరిగాక, మూత తీసి కొత్తిమీర తరుగు చల్లాలి.