Kitchen Tip : అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 నెలల వరకు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి

Kitchen Tip : అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 నెలల వరకు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి

మనం ప్రతి రెసిపీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అందుకే, వంటింట్లో ఈ పేస్ట్ తప్పకుండా ఉంటుంది. ఈ పేస్ట్ న్ని చాలామంది ఇంట్లోనే తయారుచేసుకుంటారు. అయితే, ఒక్కోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వారం పదిరోజులకే పాడవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో చెబుతోంది ఫుడ్ బ్లాగర్ ఆర్తీ మదన్.

కావాల్సినవి

అల్లం - 150 గ్రాములు, వెల్లుల్లి-250 గ్రాములు,

ఉప్పు - తగినంత, నూనె - మూడు టేబుల్ స్పూన్లు.

 ALSO READ :కీమోకు జుట్టు పోకుండా కూలింగ్ క్యాప్

తయారీ

అల్లం శుభ్రం చేసి తోలు తీసేయాలి. అలాగే, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీ పట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీలో పేస్ట్ చేయాలి. ఉప్పు, నూనె వేసి మళ్లీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఈ రెండూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా గాలి చొరబడని గాజు బాటిల్ లో నిల్వ చేయాలి. ఈ బాటిల్ ని ఫ్రిజ్లో పెడితే దాదాపు ఐదు నెలలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవదు. ఫ్రీజర్లో పెడితే ఆరు నెలలు ఫ్రెష్గా ఉంటుంది.