Kitchen tool: ఎలక్ట్రిక్ గ్యాస్​ లైటర్

Kitchen tool: ఎలక్ట్రిక్ గ్యాస్​ లైటర్

గ్యాస్​ లైటర్​తో కేవలం గ్యాస్​ స్టవ్​ని మాత్రమే వెలిగించుకోవచ్చు. క్యాండిల్​ లాంటివాటి కోసం అగ్గిపెట్టె కావాల్సిందే. కానీ.. ఈ ఎలక్ట్రిక్​ లైటర్​తో క్యాండిల్​ని వెలిగించడమే కాకుండా టపాసులకు కూడా నిప్పు పెట్టొచ్చు. దీన్ని డోడ్జ్​ ఎన్​ వాల్వ్స్​​ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ లైటర్ లిథియం–అయాన్ రీచార్జిబుల్ బ్యాటరీతో వస్తుంది. 

యూఎస్​బీతో చార్జ్​ చేసుకోవచ్చు. ఒకసారి ఫుల్​ చార్జ్ చేస్తే 4 వందల సార్లు స్టవ్​ వెలిగించొచ్చు. దీన్ని ఫుల్​ చార్జ్​ చేయడానికి 60 నిమిషాలు పడుతుంది. బ్యాటరీలో చార్జింగ్​ స్టేటస్​ని చూపించేందుకు నాలుగు ఎల్​ఈడీ ఇండికేషన్​ లైట్లు ఉంటాయి. దీన్ని 360 డిగ్రీలు ఎటు కావాలంటే అటువైపు తిప్పుకోవచ్చు. దీనికి సేఫ్టీ లాక్‌‌‌‌ కూడా ఉంటుంది. ఇది విండ్‌‌‌‌ప్రూఫ్ ఫ్లేమ్‌‌‌‌లెస్ టెక్నాలజీతో వస్తుంది. బలమైన గాలి వీస్తున్నా దీన్ని వాడొచ్చు. ఇందులో ఎలాంటి ఫ్యూయెల్​ నింపాల్సిన అవసరం లేదు. 

ధర : రూ. 284