సంక్రాంతి స్పెషల్: పతంగుల పండుగకి హైదరాబాద్ రెడీ

సంక్రాంతి వచ్చిందంటే జోష్ అంతా ఇంతా కాదు. పల్లె, పట్నం.. ఎక్కడ చూసినా పతంగులు కనిపిస్తుంటాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా అంతా జాలీగా పతంగుల ఎగరేస్తుంటారు. ట్రెండ్కి తగ్గట్లే వెరైటీ పతంగులు మార్కెట్లో దొరుకుతున్నాయి. దేశంలో అతిపెద్ద పతంగుల మార్కెట్లలో 'హైదరాబాద్' ఒకటి. మరి ఈసారి 'పతంగుల పండక్కి' ఇక్కడ సందడి ఎలా ఉందో చూద్దాం...

నగరంలోని చార్మినార్ దగ్గర ఉండే గుల్జార్ హౌజ్ పతంగుల అమ్మకానికి అడ్డా. గుల్జార్ హౌజ్ పాటు మూసాబౌలి, దూల్ పేట్, బేగంబజార్, లా లేదర్వాజా ప్రాంతాలూ ఇదే ఆదరణ పొందాయి. నగరంతోపాటు మిగతా జిల్లాల నుంచి.. ఇతర రాష్ట్రాల నుంచి గుత్తగా పతంగులను కొనుక్కె ళ్తుంటారు. సంక్రాంతికి నెలన్నర ముందు నుంచే ఇక్కడి స్టార్స్లో పతంగుల అమ్మకాలు జోరం దుకుంటాయి. దీనికితోడు ఈసారి నెలకొన్న కొన్ని పరిస్థితులు వ్యాపారుల్లో కొత్త జోష్న నింపుతున్నాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ పై నిషేధం విధించాయి. దీంతో సంప్రదాయ పతం గులకు డిమాండ్ పెరిగింది. ఇంకోవైపు నిషేధిత మాంజాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని  తెలంగాణ ప్రకటించింది. 

రిస్క్ బిజినెస్

ధూల్ పేట్, మంగళ్ పాట్, యాకుత్పురా, దవీ రిపుర, పట్టేపల్లి ప్రాంతాల్లో వందల కుటుంబాలు పతంగులు తయారు చేస్తున్నాయి. గతంలో వీళ్లలో చాలా మంది గుడుంబా వ్యాపారం చేసినవాళ్లే.అయితే ఇంతకు ముందు కంటే వ్యాపారం కాస్త తగ్గిందని.. అయినా హ్యాపీగా ఉన్నామని వ్యాపా రులు అంటున్నారు. 'గుడుంబా పని చేసేప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడేవాళ్లం. కానీ, ఈ పతంగుల వ్యాపారం మా జీవితాల్ని మార్చేసింది. నిజాయితీగా పని చేసుకుంటు న్నాం. కాకపోతే ఈ బిజినెస్లో పెద్దగా లాభం ఉండదు. అయినప్పటికీ సంతోషంగా.. సోసైటీలో గౌరవంగా బతుకుతున్నాం' అని ధరమ్ సింగ్ అనే వ్యక్తి చెబుతున్నాడు.

బల్క్ దెబ్బతీసింది

సంప్రదాయ(ప్లాస్టికేతర) పతంగులకు మార్కె ట్లో డిమాండ్ పెరిగింది. ఒక్కో కుటుంబంలో ముగ్గురు కష్టపడినా ఒక్క రోజులో 200 పతంగులు తయారు చేస్తున్నారు. పతంగి తయారీ, మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి రవాణా చార్జీలతోసహా) 30 నుంచి వంద రూపాయల దాకా ఖర్చవుతుంది. తక్కువలో తక్కువ మూడు నుంచి ఇరవై రూపాయల మధ్య పతంగులను అమ్ముతున్నారు. కొన్నింటికి సైజు, డిజైన్లను బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఈసారి దీపావళి పండుగ అయిన వెంటనే పని ప్రారంభించారు. స్థానికంగా తయారు చేయడమే కాకుండా కొన్నింటిని ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి అమ్ముతున్నారు. 'మన దగ్గర పతంగులు కొనేవా ళ్లు కొంచెం తగ్గిపోయారు. అయితే కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ పై నిషేధం విధించాయి. దీంతో అక్కడి వ్యాపారస్తులు ఇతర రకాల పతంగుల కోసం మా దగ్గరికి వస్తున్నారు. కానీ, ఈ బూమ్ను మేం సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. తెలివిగా కొందరు ముందుగానే పతంగుల్ని మా నుంచి బల్క్ గా కొను గోళ్లు చేశారు. పైగా వెరైటీ డిజైన్లతో మేం పూర్తిగా సన్నద్ధం కాలేకపోయాం. కానీ, వచ్చే ఏడాదికి హ్యాపీగా ఎగరేస్తాపూర్తిగా సిద్ధంగా ఉంటాం' అని జల్లి హనుమాన్ ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు చెబుతున్నాడు.

స్పెషల్ అట్రాక్షన్

దేవుళ్లు, ప్రముఖులు, సినిమాలు, కార్టూన్ల చిత్రాలతో పతంగులను రకరకాల డిజైన్లలో రూపొందిస్తుంటారు. మామూలుగా పేపర్, మెటల్, ప్లాస్టిక్ చేసిన పతంగులు మార్కెట్లో కనిపిస్తుంటాయి. అయితే ఈసారి గోల్డ్, సిల్వర్ పతంగులు హైదరాబాద్ మార్కెట్లో ఆకర్షణగా నిలుస్తున్నాయి. పండగకి గిఫ్ట్లు ఇద్దామనుకునేవాళ్లకు ఇది మంచి ఆప్షన్. బంగారం, వెండి పూతలతో పతంగులను చిన్న చిన్న గిఫ్ట్ ప్యాక్లు రూపంలో తయారుచేసి అమ్ముతున్నారు. ఒక గ్రామ్ గోల్డ్ కోటెడ్ గిఫ్ట్ ప్యాక్ ధర 200-500 రూపాయల మధ్య ఉంటోంది. సిల్వర్ ప్యాక్ ధర 850 రూపాయలు. వీటితోపాటు జర్మన్ సిల్వర్, మెటల్ రైట్ గిఫ్ట్ ప్యాక్లు కనిపిస్తున్నాయి. మరోవైపు 'సిల్వర్ చక్రి', 'సీసం ఫుడ్', జైపూర్ మీనా' ఆర్ట్ వర్క్ తో కూడిన గిఫ్ట్ ప్యాక్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. కాకపోతే వీటి ధర కొంచెం ఎక్కువయినప్పటికీ గుజరాతీ, మార్వాడీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

బిగ్ ఫెస్టివల్

పిల్లలకు, పెద్దలకు సంక్రాంతి సెలవుల్లోపతంగులను ఎగరేయడమే మంచి హుషారునిచ్చే ప్రక్రియ. అందుకే తెలంగాణ సర్కారు హైదరాబాద్లో అంతర్జాతీయ పరంగుల పండుగ నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానం నెల 13, 14, 15 తేదీల్లో మొత్తం పతంగులతో నిండిపోనుంది. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకల్లో 11 దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. అమ్మాయిల చదువు.. ప్రపంచ మార్పునకు నాంది థీమ్ ఈసారి పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. కైట్ ఫెస్టివల్కు అనుబంధంగా ఇంటర్ నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు.

ALSO READ | హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్..రూ. 5కోట్లు దోచుకున్న 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్..

ట్రెడిషనల్ మాంజా

చైనా మాంజా పై నిషేధంతో 'సంప్రదాయ(లోకల్) మాంజా'కి డిమాండ్ పెరిగింది. మూసీ నది తీర ప్రాంతం... మంగళ హట్ ఏరియాల్లో మాంజా తయారీదారులు ఎక్కువగా కనిపిస్తుంటారు. లోకల్ తోపాటు బరేలీ, గన్, కృష్ణ, సిక్స్ కాట్, నైన్ కాట్, 12 కాట్.. ఇలా రకరకాల మాంజాలను, వాటిని చుట్టే ఛరఖాలనూ ఇక్కడే తయారు చేస్తు న్నారు. గ్లాస్ పౌడర్ తయారు చేసే మాంజా కోసం ఇరవై వేల రూపాయల దాకా ఖర్చు చేస్తారు. దానిని మార్కెట్లో లో 28 వేల నుంచి 35 వేల దాకా అమ్ముకుంటారు. హుస్సేనీ అలం, గుల్జార్ హౌజ్, ధూల్ పేట్ మార్కెట్ లో సంప్రదాయ మాంజాబ్ ఫుల్ గిరాకీ ఉంటోంది. మహ్మద్ జావెద్ కుటుంబానికి నాలుగు తరాలుగా ఇదే పని. ఆయన కూడా.నాలుగు దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్నాడు. పొద్దున మూడింటికే లేచి పనిలో దిగుతాడు. మాంజా త్వరగా ఆరిపోయి.. మార్కెట్లో వెళ్తే ఆరోజే. డబ్బు చేతికందుతుందని అంటున్నాడు జావెద్. చైనీస్ మాంజాపై నిషేధం మా లాంటి వాళ్లకు ఆసరా ఇస్తోంది'ని మహ్మద్ దిల్దార్ ఖాన్ అంటున్నాడు. అయితే పశ్చిమ బెంగాల్, ఢిల్లీ నుంచి మాత్రం మాంజా వ్యాపారంలో విపరీతంగా పోటీ ఉంటోందట.

తగ్గిపోయిండ్రు 

పతంగులు తయారు చేసే కుటుంబాలు చాలా వరకు తగ్గిపోయాయి. సరిగ్గా పతంగుల వ్యాపారం ఊపందుకున్న టైమ్లోనే.. పని చేసేవాళ్లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని కొందరు వ్యాపా రులుఅంటున్నారు. కొందరు క్యాబ్ లు నడుపు కుంటున్నారు. ఇంకొందరు డెలివరీ బాయ్స్ గా, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. తక్కువ డిమాండ్, పెద్దగా లాభాలు లేకపోతుండటంతో చాలా మంది ఈ పనిని వదిలేసి వేరే పనులు చూ సుకుంటున్నారు' అని ధూల్ పేట్ కి చెందిన విమల బాయ్ చెబుతోంది. మాంజాను తయారు చేసే కుటుంబాల సంఖ్య మునపటిలా లేదన్నది మరి కొందరి మాట. వ్యాపారంలో నష్టాలు, తిరిగి పుం జుకుంటుందన్న నమ్మకం లేకపోవడంతో చాలా మంది వేరే పనులు చేసుకుంటున్నారని మాంజా తయారీదారుడు మన్సూర్ ఖాన్ అలియాస్ ఖాన్సిట్ అంటున్నాడు. ఆయన కుటుంబం నిజాం కాలం నుంచిటాంగూస్మంజా తయారు చేస్తోంది.

అంత టైమ్ ఎక్కడిది? 

గాలి పటాలతో ఆడే పిల్లలు బాగా తగ్గిపోయారు. పొద్దున నుంచి సాయంత్రం దాకా స్కూళ్లలోనే గడుపుతున్నరు. ఏదో పండగ సెలవుల్లో తప్ప పతంగులతో ఆడుకునే టైమ్ వాళ్లకెక్కడిది! అందుకే ఈ టైమ్లోనే అమ్మకాలు పెంచుకోవాలని మేం చూస్తాం. రేట్లు ఎక్కువగా ఉంటున్నాయనికొనేవాళ్ల సంఖ్య కూడా తగ్గింది. కానీ, పతంగుల పండుగమన సంప్రదాయం. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంక్రాంతి సీజన్లో గాలి పటాలు ఎగరేస్తున్నా. అందులో ఓ ఆనందం ఉంటుంది. కానీ, ఇప్పటి తరానికి అది అర్థం కావట్లేదు. ఎంత సేపు టీవీలు, సెల్ ఫోన్, వీడియో గేమ్స్ తోగడిపేస్తున్నారు. నేను మాత్రం ఈసారి కూడా హ్యాపీగా ఎగరేస్తా.అది కూడాసేఫ్ గా.. -సంతోష్, ఎల్బీనగర్