కివీస్‌‌‌‌దే వన్డే సిరీస్‌‌.. పాకిస్తాన్‌‌‌‌తో రెండో వన్డేలోనూ గెలుపు

కివీస్‌‌‌‌దే వన్డే సిరీస్‌‌.. పాకిస్తాన్‌‌‌‌తో రెండో వన్డేలోనూ గెలుపు

హామిల్టన్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌లో మిచెల్‌‌‌‌ హే (99 నాటౌట్‌‌‌‌), బౌలింగ్‌‌‌‌లో బెన్‌‌‌‌ సియర్స్‌‌‌‌ (5/59) చెలరేగడంతో.. పాకిస్తాన్‌‌‌‌తో జరిగిన రెండో వన్డేలోనూ న్యూజిలాండ్‌‌‌‌ 84 రన్స్‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. 

బుధవారం (April 3) జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌లో కివీస్‌‌‌‌ 50 ఓవర్లలో 292/8 స్కోరు చేసింది. తర్వాత పాక్‌‌‌‌ 41.2 ఓవర్లలో 208 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఫహీమ్‌‌‌‌ అష్రఫ్‌‌‌‌ (73), నసీమ్‌‌‌‌ షా (51) మాత్రమే పోరాడారు.  ఎనిమిది మంది సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. జాకబ్‌‌‌‌ డఫీ 3 వికెట్లు పడగొట్టాడు.