
- కేబీఆర్ పార్కు దగ్గర గ్యాస్ ఆటోను ఢీకొట్టిన యువకుడు
- నిందితుడు కేకే మనవడు.. సుమొటోగా కేసు నమోదు
జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ప్రముఖ కాంగ్రెస్‌నేత కే కేశవరావు మనవడు, బీఆర్ఎస్లీడర్విప్లవ్కుమార్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్చేసి ముందున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రెండు వాహనాలు స్వల్పంగా డ్యామేజీ కాగా బంజారాహిల్స్‌పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్‌నేత విప్లవ్‌కుమార్ కొడుకు వశిష్ట ధ్రువ్(21) ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కారులో కేబీఆర్‌పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపుకు వెళ్తున్నాడు.
ఓవర్ స్పీడ్గా వెళ్తూ ముందు గ్యాస్‌లోడ్‌తో మాదాపూర్ వైపు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ధ్రువ్కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా, గ్యాస్‌లోడ్‌తో వెళ్తున్న వాహన వెనక భాగం డ్యామేజీ అయ్యింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధ్రువ్ కే.కేశవరావు మనమడు కాగా, నగర మేయర్గద్వాల విజయలక్ష్మికి స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం.