సిరిసిల్ల టౌన్, వెలుగు: ఎమ్మెల్యే కేటీఆర్ ఇకనైనా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి హితవు పలికారు. సోమవారం సిరిసిల్ల పార్టీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల దంపతులు ఆత్మహత్యకు గురై బాధలో ఉండగా పరామర్శకు వెళ్లిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.
పదేండ్లు మంత్రిగా ఉన్న ఆయన.. నేతన్నలు ఆగం చేసిండన్నారు. గత ప్రభుత్వంలో నేతన్నల ఆత్మహత్యలు మీకు కన్పించలేదా అని ప్రశ్నించారు.